Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్ క్రాస్ హెన్రీడు నాట్ జయంతి దినోత్సవాన్ని స్థానిక స్వర్ణ భారతి ఇంజనీరింగ్ కళాశాల నందు చైర్మెన్ డాక్టర్ చంద్రమోహన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు రెడ్ క్రాస్ అవగాహన మీద వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వ్యాచరచన పోటీలలో విజేతలైన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కళాశాల చైర్మెన్ ఆర్జెసీ కృష్ణ చేతులమీదుగా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ సమాజ సేవలో మీరందరూ ముందుండాలని పేర్కొన్నారు. అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు రెడ్ క్రాస్ ప్రాముఖ్యతను గురించి వివరించారు. వైస్ చైర్మన్ రవీందర్ రావు, స్టేట్ కమిటీ మెంబర్ జనార్దన్ రావు మాట్లాడుతూ మీరందరూ రెడ్ క్రాస్ సొసైటీలో భాగస్వాములు అయి ఉండి సమాజానికి సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి గోవర్ధన్ రావు, జిల్లా వెంకటేశ్వర్లు, సత్యనారాయణ రెడ్డి, నాగేశ్వరరావు, వీరభద్రం, సూర్యప్రకాష్ రావు, శ్రీహరి, శంకర్ రావు, రాఘవయ్య, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.