Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని 22 మందికి చెక్కులను ఆయన వారికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెలంగాణ ప్రభుత్వంలో నిరుపేదలకు వరమని, వీటిని నిరుపేద కుటుంబాల్లో తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, వైస్ ఎంపీపీ పుల్లారావు, ఎంపీటీసీ మెహరామణి, సర్పంచ్లు బిబినేని భద్రం, గడ్డం భవానీ, నతానియేల్, బైటి రాజేష్, సున్నం సుశీల, కొండవీటి రాజారావు, సీతారామ్, వెంకటేశ్వర్లు, బొంతు నందు తదితరులు పాల్గొన్నారు.