Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్
- ఉజ్వల భవిష్యత్ కలగాలని విద్యార్థులకు శుభాకాంక్షలు
నవతెలంగాణ పాల్వంచ
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మన జిల్లా రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం సాధించుట పట్ల కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఫలితాలు ప్రకటించిన సందర్భంగా ఇంటర్మీడియట్ అధికారి సులోచనా రాణిని ఫలితాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో 2899 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 1958 మంది, 4085 మంది బాలికలు హాజరు నకగా 3145 మంది మొత్తం 6984 మంది పరీక్షలకు హాజరు కాగా 5103 మంది ఉత్తీర్ణతతో 73 శాతంతో రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో నిలిచినట్లు చెప్పా రు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 12వ స్థానం సాధించినట్లు చెప్పారు. మొదటి సంవత్సరంలో 3571 మంది బాలురు హాజరు కాగా 1868 మంది, 4438 మంది బాలికలకు 2997 మంది ఉత్తీర్ణతతో 60 శాతం సాధించి 12వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మొదటి సంవత్సరం వృత్తి విద్యా కోర్సులో 1118 మంది బాలురు హాజరు కాగా 493 మంది, 1245 మంది హాజరు కాగా 871 మంది మొత్తం 2363 మంది విద్యార్థులు హాజరు కాగా 1364 మంది ఉత్తీర్ణతతో 9వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. వృత్తి విద్యా కోర్సు 2వ సంవత్సరంలో 840 మంది బాలురకు 557 మంది, 1103 మంది బాలికలకు 927 మంది మొత్తం 1943 మంది విద్యార్థులు హాజరు కాగా 1484 మంది ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 5వ స్థానం సాధించినట్లు చెప్పారు. 2వ సంవత్సరం ప్రైవేట్ ఫలితాల్లో 257 మంది బాలురు, 91 మంది బాలికలు మొత్తం 348 హాజరు కాగా 114 మంది ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 6వ స్థానం సాధించినట్లు చెప్పారు. 2వ సంవత్సరం వృత్తి విద్యా ప్రైవేట్ ఫలితాల్లో 36 మంది బాలురు, నలుగురు బాలికలు మొత్తం 40 మంది హాజరు కాగా 24 మంది ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు.
ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులను, అధ్యాపకులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కలగాలని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న సంవత్సరంలో మన జిల్లా ప్రధమ స్థానం సాధించే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు.