Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర స్థాయి మార్కులతో ప్రభంజనం
- విద్యార్థులను అభినందించిన డైరెక్టర్ ఎం.కోటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డు మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో కొత్తగూడెం కృష్ణవేణి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారని, రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి అనూహ్యమైన విజయం సొంత చేసుకున్నారని కృష్ణవేణి కాలేజి డైరెక్టర్ మాచవరపు కోటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కళాశాల ఆవరణంలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలలో జూనియర్, సీనియర్ ఇంటర్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించారని తెలిపారు. వాటి వివరాలు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో ముగ్గురు విద్యార్థులు 470 మార్కులకి గాను, 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. కృష్ణవేణి విద్యార్థులు హర్షవర్ధన్ 466 మార్కులు, త్రిషిక 466, చందనప్రియ 466, సంజరు తరున్ 465, ఈశ్వర్ 465, విందు 464, యం.డి.మహెక్ తబస్సమ్ 464, వైష్ణవి 464, దేవిప్రియ 464, అనురాధా యాదవ్ 464 మార్కులు సాధించారని కళాశా డ్రైరెక్టర్ మాచవరపు కోటేశ్వరరావు తెలిపారు. బైపీసీ విభాగంలో ఐదుగురు విద్యార్థులు 440కి 434 మార్కులు సాధించారు. ఉమశ్రీ434, ఫర్హర్ అజీన్ 434, పూజిత 434, సాయికిరణ్ 434, సాధ్విక్ 434 మార్కులు సాధించారు. ఎంఈసీ గ్రూపులో నిషికా అగర్వాల్ 500కి 470 మార్కులు, మిథాలిశర్మ 465 మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు వైష్ణవి 987 మార్కులు, మేఘశ్రీ 986, షబానా 984, యశశ్వీ 983, శ్రీనిధి 983, మనోహర్ రెడ్డి 983, అఖిల్ 983, ధరణి 982, యశ్విత 980 మార్కులు సాధించారు. బైపీసీ గ్రూపులో లీనా భార్గవి 1000కి 987 మార్కులు, షాహినా 980 మార్కులు సాధించారు. ఎంఈసీ గ్రూపులో భావన 1000కి 981 మార్కులు సాధించి కాలేజి కీర్తి ప్రతిష్ఠను ఇనుమడింప చేశారన్నారు.
విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించుటకు కృషిచేసిన అధ్యాపకబృందానికి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించినందుకు డైరెక్టర్లు మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి జగదీశ్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ బి.వీరన్నలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.మున్ముందు విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.