Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుజాతనగర్ : రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలో సుజాతనగర్ సొసైటీ సెంటర్ను ప్రారంభించి మాట్లాడుతూ రైతు సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరసలో ఉంటుందని అన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రైతులు ఎటువంటి అపోహలకు పోవద్దని ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం కొత్తగూడెం సొసైటీ ఉత్తమ సొసైటీగా ఎంపికైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్య రాంబాబు, తహసిల్దార్ సునీల్ రెడ్డి, ఎండిఓ వెంకటలక్ష్మి, ఏవో నర్మదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.