Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాపారం కోసం కాదు...సేవాదృక్పదం కోసమే విద్యనందిస్తున్నాం
- నలందా విద్యాసంస్థల చైర్మెన్ ఎంవి.చౌదరి
- సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు
- నలందా విద్యాసంస్థల సీఈఓ ఎంవి.చైతన్య కృష్ణ
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కొత్తగూడెంలోని శ్రీ నలందా విద్యాసంస్థల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి విజయ ఢంకా మోగించారు. మంగళవారం కళాశాల యాజమాన్యం విడుదల చేసిన ఫలితాల వివరాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సెక్సస్మీట్లో విద్యార్థులు, వారి తల్లి దండ్రులను యాజమాన్యం ఘనంగా అభినందించారు.
ఇంటర్ మొదటి...రెండవ సంవత్సర ఫలితాలలో శ్రీ నలందా జూనియర్ కాలేజ్ విద్యార్థులు అనూహ్యమైన విజయాన్ని అందుకున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ స్టేట్ ఫస్ట్ మార్కులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాప్‌గా నిలిచిన శ్రీనలంద జూనియర్ కాలేజి విద్యార్థులు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల చైర్మన్ ఎంవి.చౌదరి మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ విభాగాలలో రాష్ట్ర్ట స్థాయి టాప్ మార్కులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. సంవత్సరం మొత్తం కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివే విద్యార్థులతో పోటీ పడుతూ జె.ఇ.ఇ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ మరియు ఎమ్ సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతూ ఈ స్థాయి మార్కులు సాధించడం శ్రీనలంద అకడమిక్ ప్రోగ్రామ్స్ విశిష్టతగా పేర్కొన్నారు.
జూనియర్ ఎంపీసీ విభాగంలో కడారి వరుణ్ 467/470, చావా భావన చౌదరి 466/470, జి.సాయి చరణ్ 466 మార్కులు, పి.సాయి మనోజ్ 465, పి.స్నేహకుమార్ 465, కె.మనోజ్ఞశ్రీ 465, సిహెచ్.విజరు కుమార్ 465 మార్కులు సాధించారు. కళాశాలకు చెదిన 32 మంది విద్యార్థులు 460 మార్కులకు పైగా సాధించి విజయ దుందుభి మోగించారని చెప్పారు.
జూనియర్ బైపీసీ విభాగంలో బి.సాయి సమైక్య 433/440, డి.శ్రావణి 430 మార్కులు సాధించారు. ఐదుగురు విద్యార్థులు 420 మార్కుల పైన సాధించారని తెలిపారు.
జూనియర్ ఎంఈసీ విభాగంలో నోముల రాజేష్ 479/500, సరికొండ ఆశ్రిత 469, జూనియర్ సీఈసీ విభాగంలో కొయ్యాడ సాయి రిషిత 463/500 మార్కులతో జిల్లా టాప్‌గా నిలిచారని తెలిపారు.
సీనియర్ ఎంపీసీ విభాగంలో కొండా వెంకట మోహన వంశీ 989/1000, కోట యువరాజ్ 988 మార్కులు, ముగిడి వెంకట లక్ష్మి 988 మార్కులు, శెట్టి వేణు 988 మార్కులతో స్టేట్ టాప్‌గా నిలిచారు. సీనియర్ జైపీసీ విభాగంలో నామాని సిరి 988/1000, మొగులోజు స్పందన 987 మార్కులతో ఘన విజయం సాధించారు. సీనియర్ ఎంఈసీ విభాగంలో ఏ.ఆశ్రిత కళ్యాణి 972/1000, పి.సృజన వేణి 971 మార్కులు, సీనియర్ సీఈసీ విభాగం నందు పప్పులు 981/1000 మార్కులతో ఘన విజయం సాధించారని వివరించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాల చైర్మన్ ఎంవి. చౌదరి, సీఈఓ.ఎం.చైతన్య కృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఇవి. మల్లికార్జునరావు, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.