Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్లతో అభివృద్ధి చేశాం
- దేశానికి ఆదర్శంగా పల్లెలు, మున్సిపాలిటీలు
- ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
బీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ను విమర్శించే వారిని నిగ్గదీసి అడగండి, నిలదీసి కడ గండి, విమర్శిస్తే ఖబర్దార్ అంటూ ఎమ్మెల్యే హరిప్రియ హెచ్చరిం చారు. బుధవారం ఇల్లందు మండ లం బొజ్జాయిగూడెం ఎస్ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశయ సాధనకు కార్య కర్తలు కృషి చేయాలన్నారు.కొంతమంది ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి స్వార్థ పూరిత రాజకీయాలకు తెరలేపుతూ కాకమ్మ కబుర్లు చెబితే నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరన్నారు. జాతీయస్థాయిలో ''అబ్ కి బార్.. కిసాన్ సర్కార్'' అనే నినా దంతో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశస్థాయిలో ప్రభంజనం సృష్టిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ సభలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు దిండిగాల రాజేందర్, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, జడ్పీటీసీ ఉమాదేవి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.