Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-బూర్గంపాడు
ఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి పని చేయాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శ్రమ శక్తి అవార్డు గ్రహీత బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డికి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలోని తాళ్ల గోమ్మూరు గ్రామంలోని రైతు వేదికలో సానికొమ్ము శంకర్ రెడ్డి ఇటీవల కార్మిక శాఖ తరపున ప్రతిష్టమైన శ్రమశక్తి అవార్డు అందుకున్న సందర్భంగా వారి సన్మాన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ సీనియర్ నాయకులు యువజన విభాగం నాయకులతో కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్ప గుచ్చాలు అందజేసి జిల్లా పార్టీ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ శ్రమ శక్తి అవార్డు గ్రహీత సాని కొమ్ము శంకర్ రెడ్డికి జిల్లా పార్టీ తరపున అదే విధంగా నియోజకవర్గం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఈ సారి జరిగే ఐటీసీ ఎన్నికలలో బీఆర్టీయూ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ అధ్యక్షులు బిక్కసాని శ్రీని వాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్, పార్టీ యువజన మండల అధ్యక్షులు గోనెలనాని, పార్టీ నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వంశీకృష్ణ, పార్టీ సారపాక టౌన్ అధ్యక్షులు శ్రీను తదితరులు పాల్గొన్నారు.