Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో మొదటి స్థానం కైవసం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలలో భద్రాచలం పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలు తిరుగులేని ఆదిపత్యాన్ని కనపరిచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎంపీసీ విభాగంలో 990 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా బైపీసీ విభాగంలో కూడా 988 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకును లిటిల్ ఫ్లవర్స్ సొంతం చేసుకుంది. ఇటు ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో జిల్లాలోని అగ్రగామిగా నిలిచిన లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల విద్యార్థులను ఆ సంస్థల డైరెక్టర్లు మాగంటి రమేష్ బాబు, మాగంటి ప్రసాద్ బాబులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో కార్పొరేట్ విద్యాసంస్థలను మించి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
జిల్లా టాపర్...లిటిల్ ఫ్లవర్స్ @ 990
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలలో భద్రాచలంకు చెందిన లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థిని గుండె లోహిత రెడ్డి 990/1000 మార్కులు సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాపర్ నిలిచింది. అదేవిధంగా సాయి ప్రవీణ 989/1000, కీర్తి 987/1000, శ్రీరామ్ గోపాలచార్యులు 987/1000, హేమశ్రీ 986/1000, సోమశ్రీ 986/1000, చింత సంజన 986/1000 వీరితోపాటు బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బర్ల శ్రావణి, పావని 988/1000, మేఘన 986/1000 మార్కులు సాధించి భద్రాద్రి కీర్తి ప్రతిష్టలను రాష్ట్రవ్యాప్తంగా చాటారు. వీరితోపాటు మొదటి సంవత్సర ఫలితాలలో కూడా లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులే పై చేయి సాధించారు.
ప్రధానంగా ఎంపీసీ మొదటి సంవత్సర ఫలితాలలో సుహాన్ హబ్సా 464/470, బి.పూజిత 464/470, నిఖిల్ 461/470, యశ్వంత్ బాలాజీ 461/470, రోషిత 460/470 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో మహమ్మద్ సమీరా 433/440, నితిన్ కుమార్ 432/440 మార్కులు సాధించి విద్యారంగంలో లిటిల్ ఫ్లవర్స్కి సాటి లేదని చాటిచెప్పారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో ఉన్నత విలువలతో కూడిన విద్య అందిస్తూ భద్రాద్రి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచి తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులను ఆ విద్యాసంస్థల యాజమాన్యాన్ని పట్టాణ ప్రముఖులు, విద్యావంతులు, అధికారులు ప్రశంసిస్తున్నారు.