Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మధిర మండలం ఖమ్మంపాడు, దెందుకూరు గ్రామల రెవిన్యూ పరిధిలోని ఇటీవల అకాలవర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ ఖమ్మంపాడు గ్రామానికి చెందిన గుమ్మ వీరాస్వామి కౌలుకి సుమారు 7 ఎకరాలలో వరి సాగుచేశారు. అకాల వర్షలతో వరి పంట పూర్తిగా నీట మునిగి మొలకలు వచ్చాయని, సుమారు లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టినట్టుగా ఆయన తెలిపారు. ప్రస్తుతం మూడు లక్షల వరకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు వరి పంటలను సందర్శించి సర్వే చేసి రైతులకు నష్టపరిహారం అందెల కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు రెండో సారి వచ్చినా తుపాను వల్ల తోర్లపాడు ఖమ్మంపాడు దెందుకూరు మర్లపాడు ఎర్రుపాలెం మండలంలో రైతాంగం తీవ్ర నష్టపోయారని అధికారులు దష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో అధికారులు చెప్పట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతుకు పంట చేతికొచ్చే సమయంలో ఈదురు గాలుల వల్ల నష్టం జరగడంతో వారు కోలుకున్న పరిస్థితి లేదని పరిహారం వెంటనే చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఏ యే పంటలు దెబ్బతిన్నాయి.., ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందో, ఎంతమంది చనిపోయారో, ఎన్ని మూగజీవాలు చనిపో యాయో తక్షణమే సర్వే చేయాలని కోరారు.అంతే కాకుండా పిడుగుపాటుతో మూగజీవాలు, పశువుల కాపర్లు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రానపు మధు, శాఖ కార్యదర్శి బాధనేని వెంకట నరసయ్య, వడిత్యా లాల్, ఆమరయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.