Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో నగరంలోనికి న్యూ విజన్ జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో మరోసారి టాప్ మార్కులతో విజయ దుందుభిని మ్రోగించింది. ఐఐటీ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ వంటి జాతీయ పోటీ పరీక్షలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా తమ అధిపత్యాన్ని సాధిస్తుందని న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మెన్ సిహెచ్జీకే ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో నుంచి 470 మార్కులకు గాను 467 మార్కులు ఎస్ మోహన్ అధిత్య, ఎస్డీ శభానా, టి. విద్వత్, పీ.భవిత, బైపీసీ విభాగం నుంచి 440 మార్కులకు 434 మార్కులు వి.జాగృతి పవార్, 433 మార్కులు సీహెచ్ సాయి వరుణ్, పీ.జ్యోతి, పీ.నమత్ర, ఎస్.అఖిల, 432 మార్కులు కే.జస్వంత్రామ్ సాధించారని, అదే విధంగా సీనియర్ ఎంపీసీ విభాగం నుంచి 1000 మార్కులకు గాను 991 మార్కులు పీ.కావ్య, ఎన్.అభిలేశ్ వెంకట్, 990 మార్కులు వి.చంద్రసాయి అనిరుధ్, వి.హర్షిణి, 989 మార్కులు టి.జస్మిద, కే.యస్వంత్ చౌదరి, కే. భవ్య, కే.అశ్రిత శ్రీ, పీ.ఉభయేంద్ర సాయి, బైపిసి విభాగం నుంచి 990 మార్కులు కే.గాయిత్రి, ఎస్కే మళీహ తఖ్దీస్, 989 మార్కులు ఏ.మోహిత్, 988 మార్కులు బి.శర్మిల, ఎండి ఇరమ్, ఎం.సుస్మశ్రీ, కే. పూజిత, 986 మార్కులు సాధించారని తెలిపారు.
రాష్ట్రస్థాయి టాప్ 10 మార్కుల్లో జూనియర్ ఎంపీసీ విభాగం నుంచి 22 మంది విద్యార్థులు, జూనియర్ బైపీసీ నుంచి 15, సీనియర్ ఎంపీసీ నుంచి 40, సీనియర్ బైపీసీ నుంచి 15 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. పరిమిత సంఖ్య గల విద్యార్థులతో సాధించిన ఘన విజయం ఇది అన్నారు. పరీక్షకు హాజరైన సీనియర్ ఎంపీసీ విభాగం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు 980 మార్కులు పైగా సాధించారని, సీనియర్ బైపీసీ విభాగంలో ఎక్కువ మంది విద్యార్థులు 970 మార్కులు పైగా సాధించారని, జూనియర్ ఎంపీసీ విభాగం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు 460 మార్కులుపైగా సాధించారని, జూనియర్ బైపీసీ విభాగంలో ఎక్కువ మంది విద్యార్థులు 430 మార్కులుపైగా సాధించారని చెప్పారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మెన్ సీహెచ్జీకే ప్రసాద్, అకాడమిక్ డైరెక్టర్ సీహెచ్ కార్తీక్, డైరెక్టర్ గోపిచంద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.