Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తునికాకు కార్మికుల పక్షాన సీపీఐ(ఎం) చేసిన పోరాటాల ఫలితంగానే కార్మికులకు చెల్లించాల్సిన బోనస్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని కార్మికుల కళ నేడు సాకారం అయిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ములకపాడు యలమంచి సీతారామయ్య భవన్లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అద్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2017 నుండి తునికాకు కార్మికుల చెల్లించాలని పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడంతో పాటు అటవీశాఖ నుండి రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఉపాద్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆద్వర్యంలో సీపీఐ(ఎం) బృందం సీసీఎఫ్ డోబ్రియల్‌ను కలసి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌కు సీపీఐ(ఎం) పక్షాన ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. గ్రామాలలో డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రభలకుండా ప్రత్యేక వైద్యశిభిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ యలమంచి రవికుమార్, పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, కొర్సా చిలకమ్మ, నాయకులు యలమంచి శ్రీనివాసరావు (శ్రీనుబాబు), కాక కృష్ణ, లక్ష్మయ్య, మహేంద్రనాధ్ పాల్గొన్నారు.