Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చుండ్రుగొండ
రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని కలెక్టర్ అనుదీప్ రైతులకు భరోసా కల్పించారు. మంగళవారం మండలంలోని మద్దుకూరు గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతాన్ని పరిశీలించారు. తేమ శాతం పరిశీలించి రైతులు ధాన్యాన్ని వెంటనే కాటాలు వేయాలన్నారు. రైతుల ఇబ్బందులు గురి చేయవద్దని తడిసిన ధాన్యం మొత్తం వెంటనే కాటాలు వేయాలన్నారు. మిల్లర్లు ఇబ్బందులు పెడితే తన దృష్టి తీసుకురావాలన్నారు. మిల్లర్ల సమస్యను తాను స్వయంగా చూసుకుంటామన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కాటాలు అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి డి.వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వరస రవికుమార్, ఏఈఓ విజయ్, గుంపిన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ధారా వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు మేడం మోహన్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.