Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
- సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సత్య, వీరన్న వినతిపత్రం అందజేత
- ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ
నవతెలంగాణ-పాల్వంచ
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఐకెపి వివోఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం పాల్వంచలోని కొత్త ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వగృహం ఎదురుగా ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఐకెపి వివోఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏప్రిల్ 17 నుంచి జరుగుతున్న సమ్మెలో భాగంగా 23వ రోజు నియోజకవర్గంలో ఉన్న వివోఏల సమస్యలు ప్రభుత్వానికి శాసనసభ్యులైనా వనమా వెంకటేశ్వరరావు జోక్యం చేసుకొని ప్రభుత్వానికి తెలియజేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు కే సత్య, డి వీరన్న కోరారు. ప్రభుత్వం అనేక రకాల ప్రభుత్వ పథకాలను వివోఏలు ప్రజలల్లోకి, తీసుకెళ్లి చైతన్య పరుస్తూ, పొదుపులు కట్టిస్తూ, ప్రభుత్వానికి ఆర్థికంగా లాభదాయకమైన పనులు చేస్తున్నారని అన్నారు. వీవోఎల జీతాలు 3900 మాత్రమే ఇస్తున్నారని అవేదన వ్యక్తం చేసారు. 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకెపి వివోఎ జిల్లా నాయకులు రేష్మా, ఐకెపి విఓఏల నాయకులు రమేష్, అనురాధ, రమాదేవి, ఉమా, పద్మ ,జయ ,కుమారి , మాధవి, స్వరూప ,రమణ, మహేశ్వరి,పాల్గొన్నారు.