Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా ఫ్యాక్టరీ యాజమాన్యానికి ధనం.. ప్రజల కళ్ళల్లో కారం
- రాత్రి వేళలో నిద్ర పట్టని వైనం
- రోగాల భారీన ముదిగొండ ప్రజలు
- పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు.
నవతెలంగాణ-ముదిగొండ
చైనా కారం ఫ్యాక్టరీ ఘాటుతో ముదిగొండ, ప్రజలు, కార్మికులు పాదాచారులు, వాహనదారులు కష్టాలు పడుతున్నారు. చింగ్ చాంగ్ చైనా కారం ఫ్యాక్టరీని (సిజిజిసి) చైనా దేశంకు చెందిన పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం వ్యాపారస్తులతో కలిసి ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో గత 15 ఏళ్ల క్రితం నిర్మాణం చేశారు. ఊరికి దూరంగా ఉండాల్సిన కారం ఫ్యాక్టరీ గ్రామ సమీపంలో ఉండటానికి ఆనాడు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సహకారంతో ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఆనాడు నుండి నేటి వరకు చైనా కారం ఫ్యాక్టరీ కొనసాగుతోంది. ఈ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న వ్యర్థపదార్థాల కాలుష్యంతో సతమతమవుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. కాలుష్యం కోరల్లో స్థానిక ప్రజలు, వాహనదారులు మగ్గిపోతున్నారు. ఫ్యాక్టరీ నడుస్తున్నప్పుడు కారం ఘాటుకు రాత్రి వేళలో ప్రజలు, చిన్నారులు, మహిళలు నిద్రపోని పరిస్థితి దాపురించింది. నిరంతరంగా దగ్గుతూ బాధపడుతూ జలుబు, అస్తమాతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారి సమీపాన కారం ఫ్యాక్టరీ ఉండటం ప్రజల అవసరాల రీత్యా ఖమ్మం-ముదిగొండ, నేలకొండపల్లి, వల్లభి, కోదాడ నుండి రాకపోకలు కొనసాగిస్తున్న వాహనదారులు, ప్రయాణకులు ప్రజలు ఫ్యాక్టరీ సమీపాన పోగానే కారం ఘాటు కళ్ళల్లో పడి, దినదినం తుమ్ములు, తగ్గుతూ మూతికి మాస్కులు, కర్చీపులు కట్టుకొని ప్రయాణాలు చేస్తున్నారు. చైనా కారం ఫ్యాక్టరీ ఘాటుకి, పగలు, రాత్రి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కారం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ధనం, ప్రజల కళ్ళల్లో కారంతో జన జీవితాలు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలపై చర్యలు తీసుకోకుండా ఫ్యాక్టరీ యజమానానికి సహకరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. చైనా కారం ఫ్యాక్టరీ నుండి ప్రజలను రక్షించి, పరిశ్రమల శాఖ అధికారులు ప్రజా ఆరోగ్యాలను నాశనం చేస్తున్న ఫ్యాక్టరీని మూసివేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.