Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
పెనుబల్లి గ్రామంలో పోట్లపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాథోని చెరువులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను మంగళవారం డా.మట్టా దయనంద్ కలుసుకుని వారి వేతనాలు, పని గంటలు, వారికున్న సమస్యలు, పని చేసే చోట వారికి కల్పించాల్సిన కనీస సదుపాయాలు, మంచినీటి, టెంట్లు ఇతర వేతన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మట్టా కూలీలకు హామీ ఇచ్చారు. సుమారుగా 200 మంది ఉపాధి హామీ కూలీలకు బిస్కెట్ ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇవ్వబోయే మెడికల్ కార్డ్ గూర్చి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో బొర్రా శ్రీనివాసరావు, మల్లెలరాకాటిని చెన్నకేశవ, చలమాల రాజ్ కుమార్, కిరణ్ మరు, తదితరులు పాల్గొన్నారు.