Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్మన్ కమల్ రాజు
నవతెలంగాణ-బోనకల్
రైతన్నల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, పంట కొనుగోలు విషయంలో రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మండల పరిధిలోనే ముస్టికుంట్ల సహకార సంఘంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైతన్నల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, సాగునీటి వనరుల అభివృద్ధి లాంటి ఎన్నో విప్లవాత్మక పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతన్నలు ఆరు కాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు విషయంలో ఎలాంటి కష్టాలకు గురి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి అండగా నిలబడి గిట్టుబాటు ధర కల్పించి పంట కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ప్రకృతి పరంగా ఈ ఏడాది ఎంతో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం రైతులు లేకుండా ఈ దేశం రైతుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఒ విజరు కుమారి, మార్క్ పెడ్ డిఎం సునీత, డిసిసిబి బోనకల్ బ్రాంచ్ మేనేజర్ షేక్ షరీన్, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సహకార సంఘ అధ్యక్షుడు దొడ్డ నాగేశ్వరరావు, సీఈవో బోయినపల్లి మహేశ్వరరావు, రైతు బంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, సహకార సంఘ డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు.