Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న
నవతెలంగాణ-పినపాక
పినపాక, కరక గూడెం మండలాల్లో పోడుభూమి సమస్య జటిలమవుతుందని ఇప్పటికే సాగులో ఉండబడిన పోడు భూముల్లో ప్లాంటేషన్ వేస్తూ ఇంకుడు గుంతల నిర్మాణం కొనసాగిస్తున్నారని వాటిని వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పినపాక మండలం జానంపేట గ్రామంలో సిపిఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ శాఖ, రెవిన్యూ శాఖ జాయింట్ సర్వే ద్వారా హద్దులు నిర్ణయించాలని, అటవీ శాఖ అనుమతుల వలన పెండింగ్లో ఉండబడిన రోడ్లు తక్షణమే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అర్హత కలిగిన వారందరికీ తక్షణమే పోడు పట్టాలు ఇవ్వాలని, ప్లాంటేషన్ వేసిన భూములు తక్షణమే సర్వే చేసి సాగుదారులకు స్వాధీన పరచాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 ముందు నుండి పేదలు సాగు చేస్తున్న పోడు భూముల్లో ప్లాంటేషన్ పేరుతో మొక్కలు వేయవద్దన్నారు. వలస ఆదివాసీలకు సైతం మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సేకరిస్తున్న భూమికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇప్పుడు ఉన్న మార్కెట్ ధర ప్రకారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. అకాల వర్షంతో నష్టపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాక ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి అదనపు బోనస్ రేటు ప్రకటిం చాలన్నారు. తుని కాకు బోనస్ తునికాకు కోసిన
ప్రతీ కార్మికుడికి చెల్లించాలన్నారు.
బుధవారం కరకగూడెం పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి సైతం కరకగూడెం పినపాక
మండలాల సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేసినట్లుగా సిపిఎం మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మడివి రమేష్, దుబ్బ గోవర్ధన్, కల్తి వెంకటేశ్వర్లు, నట్టి శంకరయ్య, పాల్గొన్నారు.