Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ శాఖ జిల్లా అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖలో కంపా నిధులతో చేపట్టనున్న పనులు అత్యంత శాస్త్రీయంగా ప్రభావంతంగా జవాబుదారితనంతో అడవుల వికాసం పునర్జీవానికి తోడ్పడుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్ తెలిపారు. అడవి ఆవాసాల అభివృద్ధి కోసం ఆయా ప్రాంతాల అవసరాన్ని బట్టి ఫౌండరీ కందకాలు, ఫౌండరీ పిల్లర్లు గచ్చకాయ ప్లాంటేషన్లు నర్సరీలు అటవీ పునర్జీవనా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అడవి జంతువుల ఆహారం కోసం గడ్డి మైదానాలు ఏర్పాటు చేస్తున్నామని, వన్యప్రాణుల సంరక్షణ కోసం కందకాలు రాతి కట్టడాలు, నీటి కుంటలు చెక్ డ్యాములు నీటి చెలిమేలు సహా నీటి వనరులు లేని దగ్గర నీటి కోసం సాసర్ ప్లేట్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అడవిలో మంటలు నివారణ కోసం ఫైర్ లైన్లు ఫైర్ వాచెస్ ఫైర్ వాచ్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అటవీ ఆవాసాల అభివృద్ధి కోసం చేపట్టే ఈ పనుల్లో అత్యంత శాస్త్రీయంగా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామని, ముందుగా ఆవాసాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏ ప్రాంతాల్లో ఏ ఏ పనులు చేపట్టాలో నిర్ణయిస్తున్నామని అన్నారు. ఇందుకోసం శాస్త్ర సాంకేతిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని, డివిజన్ల వారీగా ఈ సంవత్సరం చేపట్టే అన్ని పనులు నివేదికను రాష్ట్ర కేంద్ర స్థాయి కమిటీల ద్వారా ఆమోదం తీసుకుంటున్నామని, అనుమతి లభించిన పనులను రకరకాల పద్ధతిలో చేపడుతామని అన్నారు. కాంటాక్ట్ పద్ధతి చిన్న కాంటాక్ట్ పద్ధతి నామినేషన్ పద్ధతి డిపార్ట్మెంట్ ద్వారా ఇలా రకరకాలుగా స్థానిక పరిస్థితులను బట్టి కంప నియమ నిబంధనలు అనుసరించి పనులు చేపడతామన్నారు. పనులలో నాణ్యత పర్యవేక్షించడం కోసం అనేక స్థాయిలో పనులు తనిఖీ చేస్తామని బీట్ అధికారి చేపట్టిన పనులను వివిధ స్థాయిలో శిక్షణ అధికారులు రేంజ్ ఆఫీసర్స్ డివిజనల్ జిల్లా సర్కిల్ స్థాయి అధికారులు తప్పనిసరిగా అతనికి చేస్తారన్నారు. వీరికి సమాంతరంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే టాస్క్ ఫోర్స్ ప్లైన్ స్కాట్స్ టీమ్స్ ఎప్పటికప్పుడు పనులను తనిఖీ చేస్తారన్నారు.