Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియు పట్టణ కన్వీనర్ కే సత్య
నవతెలంగాణ-పాల్వంచ
సమ్మె విచ్ఛిన్నానికి చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని సిఐటియు పట్టణ కన్వీనర్ కే సత్య ఉన్నారు. ఐకెపి వివోఎలా సమస్యలు పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న సమ్మె 25 రోజులకు చేరింది. గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రూప్‌లో ఉన్నా ఓబిలు ఉత్తరాలు రాసి పంపించినారని, సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ కన్వీనర్ సత్య మాట్లాడుతూ గత 25 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఐకెపి వివోఎల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుందని, సమ్మె విచ్చినానికి చేసే కుట్రలను తిప్పి కొడతామని అన్నారు. సమస్యల పరిష్కారానికి సమ్మెలోకి అనివార్యమైన పక్షంలో ఏప్రిల్ 17 నుండి ప్రారంభం చేశారని, మార్చి నెలలో మూడు రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేకపోయేసరికి నిరవధిక సమ్మె కి దిగారని అన్నారు. వివోఎల అధ్యక్షురాలు అనూరాధ, కార్యదర్శి రమేష్, కోశాధకారి రమాదేవి, ఉమరోజా కుమారి, రమాదేవి, రాజ్య లక్ష్మి, మీనా పాల్గొన్నారు.