Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 నుంచి 36 ఏళ్ల యువతీ యువకులు అర్హులు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
మే 15 నుండి 17 వరకు మండలం, 22 నుండి 24 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించే జిల్లా స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. క్రీడాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండల స్థాయిలో అథ్లెటిక్ కబడ్డీ ఫుట్బాల్, ఖోఖో, వాలీబాల్ జిల్లా స్థాయిలో బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, హ్యాండ్ బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్ తో పాటు 11 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర క్రీడ స్రాధికార సంస్థ ఆదేశాల మేరకు సీఎం కప్ టోర్నమెంట్ మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో 15 నుంచి 36 ఏళ్ల వయసుగల యువతీ యువకులకు పాల్గొనాలని తెలిపారు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, జిల్లా ఎస్పీ వైస్ చైర్మన్గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కో వైస్ చైర్మన్గా డివైస్ఓ, కన్వీనర్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, డీఈవో పరిశీలన శాఖ జీఎం మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారని చెప్పారు. రాష్ట్రస్థాయిలో పథమ బహుమతి కింద 20వేలు, ద్వితీయ బహుమతికి 15వేలు, తృతీయ బహుమతికి 10వేలు నగదు రూపంలో పాటు సీఎం కప్పుని అందజేస్తామని చెప్పారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు క్రీడలలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.