Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైకుంఠధామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి
- క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన పూర్తి చేయాలి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
ఇంటింటి నుండి తడి పొడి వ్యర్ధాలు సేకరణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశం హాల్లో పంచాయతీరాజ్ అధికారులతో పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తడి పొడి వ్యర్ధాలు వేరుచేసి పంచాయతీ సిబ్బందికి అందజే విధానంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ట్రాక్టర్లు తడి పొడి వ్యర్ధాలు వేయు విధంగా విభజించాలని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో వ్యర్ధాల ద్వారా సమకూరున వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. వైకుంఠధామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. నాలుగు వేలు దాటిన గ్రామపంచాయతీలలో మృతదేహాలను భద్రపరచు ఫ్రీజర్లు, 10వేలు దాటిన గ్రామపంచాయతీలు వైకుంఠ రథం సౌకర్యం ఉండాలని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షన్, స్వచ్ఛభారత్ గ్రామీణ పనులు పెండింగ్ లేకుండా చేయాలని ఆదేశించారు. సింగిల్ ఫీట్లను డబుల్ ఫీట్లుగా మార్చుట సెప్టిక్ ట్యాంకులను లీచ్ సీట్ గా మార్చేందుకు ప్రతి మండలానికి 25 లక్ష్యానికి కేటాయించినట్లు చెప్పారు. రెండు వారాల్లో లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. ప్రత్యేక అధికారి ధ్రువీకరణతో నివేదికలు అందజేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. మండల వారిగా ప్రగతిని సమీక్షించిన ఆయన పూర్తి చేసినందుకు చేపట్టాల్సిన చర్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో టీములు పర్యటించి నివేదిక అందజేయాలని ఎంపిక చేసిన 102 గ్రామపంచాయతీలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, తదితర మౌలిక సౌకర్యాలు నివేదికల సోమవారం వరకు పూర్తి చేయాలని చెప్పారు. వైట్ హౌస్ గ్రామపంచాయతీలుగా ఎంపిక చేసిన మొండికుంట, రామచంద్రాపురం, మొరంపల్లి బంజర, ఇరువెండి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలుపై కమిటీ విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. నూతనంగా నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి తక్షణం అనుమతులు మంజూరు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. బహుత్ పల్లె ప్రకృతి వనాల నిర్మాణంలో లోపాలను వద్దని నిర్మాణంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు 431 పూర్తయ్యని అసంపూర్తిగా ఉన్న మండలాల్లో ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిఆర్డిఓకు జడ్పీ సీఈఓకు సూచించారు. రెవెన్యూ ప్లాంటేషన్లో చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ నాటేందుకు ఈ నెల ఆఖరు వరకు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. రానున్న హరితహారంలో మొక్కలు నాటేందుకు పూర్తి స్థాయిలో సమర్థము ఉండాలని చెప్పారు. అశ్వరావుపేట, భద్రాచలం, సారపాక, గౌతంపూర్ పంచాయతీలలో ప్లాస్టిక్ వర్ధ్యాల ప్యాంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గౌతంపూర్ పంచాయతీలో గోవ్యర్థ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, జెడ్పి సీఈవో విద్యులత, డివిజనల్ పంచాయతీ అధికారులు ఎంపీవోలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.