Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెయిన్ హాస్పిటల్ అడిషనల్ సీఎంఓ ఏ.సుజాత
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి ఆసుపత్రిలో వైద్యులు నిబద్దతతో వైద్య సేవలు అందించాలని కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ అడిషనల్ సీఎంఓ ఏ.సుజాత వివరించారు. గురువారం తమ అధికారిక పర్యటనలో భాగంగా పిని కాలనీ సింగరేణి కాలరీస్ ఏరియా హాస్పిటల్‌ను తనిఖీ నిర్వహించారు. మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ ఏరియా హాస్పిటల్ ను సందర్శించి క్యాజువాలిటీ, మాటి వార్డ్‌ని, స్టోర్స్ సెంట్రల్ ఫార్మసీ, క్యాంటిన్, మెడికల్ ఓపీ, ఆపరేషన్ థియేటర్‌తో పాటు ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ వైద్య విభాగంలో పని చేయడం ఎంతో బాధ్యతతో కోరుకున్నదన్నారు. కాబట్టి వైద్యులు, వైద్య సిబ్బంది అన్నీ వేళల ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలన్నారు. సింగరేణియులకు వారి కుటుంబ సభ్యులకు నిరంతరం నిబద్ధతతో కూడిన వైద్య సేవలు అందించాలన్నారు. అలాగే ఆసుపత్రిలో అన్నీ రకాల మెడిసిన్స్ ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అడిషనల్ సీఎంఓ ఏ. సుజాత మర్యాద పూర్వకంగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీజిఎం(పర్సనల్) ఎస్.రమేశ్, డివై సిఎంఓ మేరీ కుమారి, మెడికల్ సూపరింటెండెంట్ టి.శేషగిరి, సర్జన్, గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.