Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలో గురువారం సాయంత్రం ఒక్క సారిగా ఉరుములు మెరుపులతో పెద్ద ఎత్తున గాలి వానతో వర్షం కుమ్మరించింది. పర్ణశాల నుండి లకీëనగరం పెద్ద ఎత్తున వచ్చిన గాలి వానకు పూరి గుడెసెల్లో ఉన్నవారు ఒక్క సారిగా భయ భ్రాంతులకు గురయ్యారు. భద్రాచలం, చర్ల ప్రధాన రహదారి చిన్నబండిరేవు గ్రామ సమీపంలో రెండు భారీ వృక్షాలు రహదారికి అడ్డంగా పడి పోవడంతో వాహనాలు రహదారి పొడవునా నిలిచి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు పెళ్లి మహూర్తాలకు మంచి రోజు కావడంతో పెళ్లి పనులకు ముస్తాబు చేసుకున్న కళ్యాణ మండపాలు పలు చోట్ల కింద పడి పోయి పెళ్లి పనులకు ఆటంకంగా మారింది. ఏది ఏమైనా గాలి వానకు ఒక్క సారిగా జన జీవనం అతలాకుతలం అయినంత పని అయిందనే చెప్పవచ్చు.