Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం
అంతర్జాతీయస్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన రెజ్లర్లపై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపి, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ అఖిలభారత మహిళా సంఘం (ఐద్వా) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సంతకాలు సేకరించారు. గత రెండు వారాలుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా బిజెపి ప్రభుత్వం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. మల్ల యోధులకే బీజేపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోతే సామాన్య జనం పరిస్థితి ఏంటి? అని సంఘం జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళా భద్రత మరింత ప్రమాదంలో పడిందన్నారు. స్వయంగా ఆ పార్టీ నేతలు, పార్లమెంటు సభ్యులు మహిళల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తూ.. అరాచకాలకు పాల్పడుతున్న చర్యలు తీసుకోకపోవడం పై ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐద్వా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. మహిళా రేజ్లర్లకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు రమణ, నాగ సులోచన, మేహరున్నిసా బేగం, అమరావతి, భాగం అజిత, అరుణ, కుమారి తదితరులు పాల్గొన్నారు.