Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ బానోత్ పార్వతి
నవతెలంగాణ-చండ్రుగొండ
వేసవిలో గ్రామంలో మంచి నీటి సమస్యలు తలెత్తకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేసవిలో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలన్నారు. గొర్రెలు రెండో విడతగా 8 సో సెట్టిల్కు గాను 584 మంది లబ్ధిదారులు ఎంపిక గుర్తించటం జరుగుతుందన్నారు. వచ్చే నెలలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలవుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో గత ఏడాది కంటే ఈ ఏడాది కూలీల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఈ మార్పు మంచిది కాదని, కూలీల ఉపాధి హామీ పథకాన్ని వినియోగం చేసుకోవాలన్నారు. రేషన్ దుకాణాలు సైతం ప్రతిరోజు సమయ పాలన పాటించాలన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను తవ్వించుకోవాలని మరుగుదొడ్లను నిర్మించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ, యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహించారు. సర్వసభ్య సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో ప్రజా ప్రతినిధులు ముక్తకంఠంతో సూచించారు. హాజరుకాని వివరాలు జిల్లాకు పంపుతామని ఎంపీడీవో రేవతి సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, వైఎస్ ఎంపీపీ నరుకుల సత్యనారాయణ, ఎంపీటీసీలు ధారా బాబు, గూగులోత్ మీనా, బొర్రా లలిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.