Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య
నవతెలంగాణ-సుజాతనగర్
రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని సొసైటీ లో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విధంగా తడిసిన ధాన్యంతో పాటు మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, తేమ శాతం 17 నుంచి 20కు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం తెచ్చి దాదాపు వారం రోజులు కావస్తుందని త్వరగా కాటాలు వేసి కొనుగోలు ప్రారంభించాలని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఏడాది మాదిరిగా నిబంధనలకు విరుద్ధంగా తరుగు తీస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో టెంట్లు, మంచినీటి వసతి కల్పించాలని అన్నారు. రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఉడుగుల శ్రీకాంత్, రైతు సంఘం నాయకులు బాలు వెంకటేశ్వర్లు, కొండే కృష్ణ, నల్లగోపు పుల్లయ్య, మొగల సాహెబ్, భద్రయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.