Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ పార్క్ మెయింటినెన్స్ మెరుగుపరచాలి
- ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షడు జాన్
నవతెలంగాణ-మణుగూరు
కార్మిక వాడల్లో పారిశుధ్య పనులు నిర్వహించాలని, అంబేద్కర్ పార్క్ మెయింటెనెన్స్ మెరుగుపరచాలని, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీి) బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వెలగపల్లి జాన్ పేర్కొన్నారు. శుక్రవారం పీవీ కాలనీ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పి.వి.కాలనీలలో పారిశుధ్యం సరిగా లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షం వస్తే గుంతలలో నీళ్లు, వేసవికాలం వస్తే కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. పారిశుధ్య కార్మికులు రోడ్లు శుభ్రం చేయడమే కాకుండా తారు రోడ్లు కూడా వాళ్లతోనే వేయిస్తున్నారన్నారు. ఎక్కడ పని చేయాలన్న అదే కార్మికులను ఉపయోగిస్తున్నారు. గ్రౌండ్లో మట్టి సరిచేయాలన్న, వాటర్ ట్యాంక్లో మట్టి తీయిస్తున్నారు. ట్యాంకు దగ్గర పని చేస్తుండగా కార్మికులను విపరీతంగా తేనెటీగల కుట్టడం ప్రైవేట్ హాస్పటల్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగిందన్నారు. ఒక్కొక్క కార్మికుడు మూడు, నాలుగు రోజులు డ్యూటీకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నారని, కాంట్రాక్టర్లు ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు కానీ, డ్యూటీకి రాని రోజుల్లో మస్టర్లు గాని ఇవ్వ లేదన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీ పట్టనట్టు ఉంటున్నారే తప్ప తగు చర్యలు తీసుకోవడంలేదన్నారు. కాలనీలలో సానిటరీ ఇన్స్పెక్టర్ లేక పోవటం కూడా ఈ సమస్యలు పేరుకుపోవటానికి ప్రధాన కారణమన్నారు. కార్మికుల దగ్గర రికవరీ చేస్తున్న డబ్బులు ఈ విధంగా దుర్యోనియోగం అవటం కార్మికులలో తీవ్ర చర్చ మొదలైనదన్నారు. అంతర్గత రోడ్లు వెంటనే ఏర్పాటు చేయాలని లేని పక్షమున ఐఎన్టీయూసీి జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సి వస్తుందని, అందుకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఐఎన్టీయూసీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టి.పెద్ద నాగయ్య, బి.రాజలింగు పాల్గొన్నారు.