Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్
- గౌరవ హైకోర్టు తీర్పును అమలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా.
నవతెలంగాణ-పాల్వంచ
కోయగూడెం ఓసి-2, ఫిట్ వన్, భూ నిర్వాసితులకు వారం రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు 2018 డిసెంబర్లో తీర్పు ఇచ్చిన ఇప్పటివరకు కలెక్టర్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆదివాసీ గిరిజనులు దళితులు కాబట్టే కలెక్టర్ నష్ట పరిహారం చెల్లించకుండా వివక్షతను చూపుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, భూ నిర్వాసితుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మండిపట్టారు. శుక్రవారం నిర్వాసితులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వ్యక్తిగత దరఖాస్తులను జాయింట్ కలెక్టర్‌కి అందించారు. ఈ సందర్భంగా జేసీ తిరిగి మళ్ళీ రీ సర్వే చేస్తామని అనడం వల్ల కాలం గడుస్తుందే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికే తహసీల్దార్, ఆర్డీవో ఎంక్వయిరీ చేసి ఎఫ్ఆర్సీ పట్టా భూములు కోల్పోయిన వారిని పట్టా లేకుండా అనుభవంలో ఉన్న సాగుదారులని గుర్తించి గతంలో కలెక్టర్‌కి రిపోర్ట్ ఇచ్చారని, దానిని హైకోర్టు తీర్పును అమలు చేయడంలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మూడు తరాలుగా సాగులో ఉన్న ఆదివాసి గిరిజనేతర పేదలైన దళితులు బీసీలకు గ్రామసభ తీర్మానం ఆధారంగా చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలి, అటవీ హక్కుల చట్ట ప్రకారం భూమికి నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని ఉన్న అధికారులు అమలు చేయకపోవడం చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈసం నర్సింహారావు, జోగ దశరథ్, చింత రమేష్, జబ్బ కన్నయ్య, వరప్రసాద్, ఎర్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.