Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోడు పట్టాలివ్వాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
సీపీఐ(ఎం) రాష్ట్రవ్యాప్తంగా దశల వారి ఆందోళనలు, పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తునికాకు కార్మికులకు బోనస్ పంపిణీ చేసిందని జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం ఉప్పతల నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కనకయ్య మాట్లాడుతూ 2014 నుండి దశల వారి ఆందోళనలు, పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి తునికాకు కార్మికులకు బోనస్ అందించిందన్నారు. ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అటవీశాఖ మంత్రులకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక సార్లు వినతి పత్రాల అందించడం, ఆందోళనలు కారణంగానే ఈరోజు తునికాకు కార్మికులకు బోనస్తులు అందించారే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పతనం కాదన్నారు. చిత్తశుద్ధి ఉంటే పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 11 లక్షల మంది పోడు హక్కు పత్రాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 మందికి మాత్రమే మూడున్నర లక్షల ఎకరాలకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం సనద్ధమవుతుందని సమాచారం అన్నారు.
పోడుహక్కుదారులకు పట్టాలు ఇవ్వకుండా ఉల్లంఘించినట్లయితే ఉద్యమాలు నిర్వహించేందుకు ప్రభుత్వమే కారణం అవుతుందన్నారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి కోడిశాల రాములు, లెనిన్ బాబు, టీవీ ఎం.వి ప్రసాద్, ఉత్పతల నరసింహారావు, సత్రపల్లి సాంబశివరావు, నాగమణి, తోట పద్మ, వై.నాగలక్ష్మి, సుధాకర్, నందం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.